గ్రీన్ అండ్ వైట్ సూప్

 

 

కావలసిన పదార్థములు:

ఉల్లిపాయలు                            : 8

నీళ్ళు                                      : 12 కప్పులు

వెన్న                                       : 3 కప్పులు

బంగాళదుంపలు                       : 8

పచ్చిబఠాణీలు                          : 2 కప్పులు

ఉప్పు                                      : రుచికి తగినంత

మిరియాలపొడి                          : 2 స్పూన్లు

మీగడ                                      : తగినంత

తయారుచేయు విధానం:

* ముందుగా ఉల్లిపాయల్ని కడిగి పై పొరని తీసివేయాలి. తరువాత ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా తరగాలి.

* బంగాళాదుంపల్ని పై పొట్టు తీసి సన్నగా తరగాలి. ఓ పాత్రని స్టవ్‌మీద పెట్టి పాత్ర వేడి అవ్వగానే వెన్న వేసి కరగనివ్వాలి.

* వెన్న కరగగానే తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి సన్నటి సెగమీద ఉంచి వేగనివ్వాలి. ఉల్లిపాయలు మెత్తబడగానే బంగాళాదుంప ముక్కల్ని, బఠాణీలని వేసి ఉప్పు, మిరియాలపొడిని చల్లాలి. తరువాత నీళ్ళు పోసి 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అనంతరం స్టవ్‌మీద నుండి దించి చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత వడగట్టాలి.

* ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో పోసి మూతపెట్టి సుమారుగా రెండున్నర గంటల వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి.

* ఆ తరువాత కొంత మీగడ వేసి బాగా కలపాలి. అనంతరం నిమ్మరసం పిండాలి. దాన్ని గాజు గిన్నెలో వేస్తే అది ఆకు పచ్చగా తెల్లగా ఉండి చాలా రుచిగా ఉంటుంది.