Fried Egg Kofta Recipe

 

 

 

కావలసినవి:

* కోడిగుడ్లు 5

* ఉప్పు – టీ స్పూను,

* మిరియాలు- అర టీ స్పూన్

 

కోఫ్తాల తయారీ:

* బంగాళా దుంపలు – నాలుగు

* క్యారెట్- రెండు

* బీన్స్ -15

* ఉల్లిపాయలు – రెండు

* అల్లం – చిన్న ముక్క

* పచ్చిమిర్చి- నాలుగు

* నిమ్మకాయ- ఒకటి

* ఉప్పు – తగినంత

* నూనె – వేయించడానికి సరిపడా

 

తయారు చేయు విధానం:

* కోఫ్తాల కోసం ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా ముద్ద చేసి ఉంచాలి. ఓ బాణలిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు... అన్నీ కలిపి మూడు నిమిషాలు వేయించి ఆలుగడ్డ ముద్ద కూడా వేసి వేయాలి. అందులోనే నిమ్మరసం, ఉప్పు వేసి దించి చిన్న ఉండలుగా చుట్టి కార్న్ ఫ్లోర్ లో దొర్లించాలి. తరువాత వీటిని నూనెలో వేయించి తీయాలి.

ఓ గిన్నెకు అడుగున కొద్దిగా నూనె పూసి కోడిగుడ్ల సోన ఉప్పు, మిరియాల పొడి వేసి గిలకొట్టాలి. ఇప్పుడు కోఫ్తాలు వేయించి తీసిన బాణలిలోనే కొద్దిగా నూనె ఉంచి, ఓ గరిటెడు గుడ్డు సోన మిశ్రమాన్నీ వేసి దాని మధ్యలో కోఫ్తాను ఉంచాలి. పక్కకు వచ్చిన గుడ్డు మిక్స్ ను కోఫ్తా వైపు తిప్పుతుండాలి. ఇలా అన్ని కోఫ్తాల్ని ఫ్రై చేసి స్నాక్స్ లా అందించండి