ఫిష్ ఫింగర్స్

 

 

 

కావలసిన పదార్థాలు:

చేపముక్కలు - నాలుగు

మైదా - మూడు చెంచాలు

మిరియాల పొడి - అరచెంచా

వెనిగర్ - రెండు చెంచాలు

కారం - ఒక చెంచా

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

కోడిగుడ్డు - ఒకటి

బ్రెడ్ పొడి - అరకప్పు

నూనె - వేయించడానికి సరిపడా

 

తయారీ విధానం:

కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ముళ్లు తీసేయాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాబచ్చాగా ఉంచుకోవాలి. దీన్ని ఓ బౌల్ లో తీసుకుని వెనిగర్ వేసి కలపాలి. తరువాత మైదా, మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, ఫొటోలో చూపిన మాదిరిగా ఒత్తుకోవాలి. వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

 

- Sameera