Sweet Gold Coins ( Fathers Day Special )

 

 

 

నాన్న అంటే ఎంతో ప్రేమ ...పిల్లలకి ..మరి ఆ ప్రేమని నాన్నకి తెలిసేలా చూపటానికి అవకాశం వస్తే దానిని అంత తేలికగా ఎలా వదులుతారు చెప్పండి. నాన్నకి ఎన్నో చేయాలని అనుకునే పిల్లలకి, త్వరగా అయ్యే ఒక స్వీట్ చెబుతున్నా ..ఇది చేయటం సులువు..రుచి సూపర్ గా వుంటుంది.

 

కావలసిన పదార్దాలు
బ్రెడ్      ...ఒక పాకేట్
పంచదార    ...ఒక పావు
యాలుకుల పొడి ..అర చెమ్చా
నువ్వులు  ....5 చెంచాలు
నెయ్యి       ......5 చెంచాలు

 

తయారీ విధానం

ముందుగా బ్రెడ్ ని ఒక చిన్న గ్లాస్ తో గట్టిగ వత్తి రౌండ్  షేప్ లో కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ పీసులని అలా కట్ చేసుకుని పెట్టుకున్నాక, పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పంచదార వేసి కొంచం నీరు పోసి పాకం పట్టాలి . కొంచం ముదురు పాకం రావాలి. పాకం సిద్దం అయ్యాక ఒకొక్క బ్రెడ్ పీసుని పాకంలో ముంచి వెంటనే తీసి ప్లేట్ లో పెట్టాలి. వాటిమీద చిన్నగా ఏలకుల పొడి జల్లి, ఆ మీద వేయించిన నువ్వులు జల్లాలి. గోల్డ్ కాయిన్స్ రెడీ. పాకం లో బ్రెడ్ ని ముంచి తీయటం జాగ్రత్తగా చేయాలి. లేదంటే విరిగే అవకాశం వుంది. పాకాన్ని చిన్న ప్లేట్ లో వేసి అందులో బ్రెడ్ ముంచి తీయటం సులువు గా వుంటుంది. సింపుల్ గా , రుచిగా వుండే ఈ స్వీట్ నాన్నకి చాలా నచ్చుతుంది ..ట్రై చేయండి.

 

-రమ