డేట్స్ అండ్ ఓట్స్ స్మూత్ బిస్కెట్స్

 

 

ఖర్జూరం గుండెలకి చాలా బలాన్నిస్తుందని చెప్పినా పిల్లలు వాటిని తినటానికి అంతగా ఇంట్రస్ట్ చూపించరు. అదే ఖర్జూరాల్లో కొంచెం ఓట్స్ మరికొంచం నట్స్ కలిపి టేస్టీ బిస్కట్స్ లాగా చేసి పెడితే టేస్ట్ కి టేస్ట్, బలానికి బలం. మరి అవి ఎలాగ చెయ్యాలో చూద్దామా.

 

కావాల్సిన పదార్థాలు:

ఖర్జూరాలు - 12  

ఓట్స్ - 1 కప్పు

జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా - 1/2 కప్పు

నెయ్యి - 5 చెంచాలు

యాలకుల పొడి - కొద్దిగా

 

తయారి విధానం:

ఈ స్మూత్ బిస్కెట్స్ తయారుచేయటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఓట్స్ ని ఎర్రగా వేయించుకోవాలి. అవి చల్లారాకా మిక్సి లో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పులని, బాడంపప్పులని, పిస్తాపప్పులని నెయ్యిలో వేయించుకుని కాస్త పప్పులు పప్పులుగా ఉండేలా మిక్సి చేసి ఉంచుకోవాలి. అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసి అందులో డేట్స్ వేసి స్టవ్ సిమ్ లో పెట్టి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. అవి పూర్తిగా మెత్తగా అయ్యాకా స్టవ్ ఆపి కాస్త చల్లారాకా ఓట్స్ పొడి, పప్పుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా అయారయిన ముద్దని చపాతిలాగా వత్తి ఇష్టమయిన షేప్ లో కట్ చేసుకోవచ్చు లేదా ఉండలుగా కూడా చుట్టుకోవచ్చు. కాని పిల్లలు ఎక్కువగా బిస్కట్స్ లాగ పల్చగా ఉంటే ఇష్టంగా తింటారు. ఇందులో అన్ని రకాల బలవర్ధకమైన పదార్థాలు కలిసాయి కాబట్టి పిల్లలలకి ఎంతో బలాన్నిస్తుంది.  


...కళ్యాణి