కాఫీ మిల్క్ షేక్..

(సమ్మర్ స్పెషల్)

 

కావలసిన పదార్ధాలు..

ఇన్ స్టంట్ కాఫీ    - ఒక చెంచా
నీళ్లు                 - పావుకప్పు
పాలు                - రెండు కప్పులు
చక్కెర               - నాలుగు చెంచాలు

తయారీ విధానం..

ముందుగా పాలను కాచి చల్లార్చాలి. కాఫీ, చక్కెర, నీళ్లను కలిపి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత పాలను వేరుగా బ్లెండ్ చేయండి. ఆపైన ఈ పాలను కాఫీ మిశ్రమంలో వేసి బాగా కలపండి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో పెట్టి, చల్లబడ్డాక సర్వ్ చేయండి. టైమ్ లేకపోతే ఐస్ క్యూబ్స్ కూడా వేసి అందించవచ్చు. అలాగే పైన కొద్దిగా క్రీమ్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మిల్క్ షేక్ బాగా రుచిగా ఉండాలంటే క్రీమ్ బాగా ఉన్న పాలను తీసుకోవాలి మర్చిపోకండి.

--sameera