చాకోలెట్ తో గులాబ్ జామున్ ( Childrens Day Special )

 

 

కావలసినవి :

 

గులాబ్ జామ్ పౌడర్  - 1కప్పు

డైరీ మిల్క్ చాకోలెట్ - 1

పాలు - ఒక కప్

పంచదారా -  ఒకటిన్నర కప్పు

డాల్డా - సరిపడా

 

తయారీ :

 

ముందుగా చాకొలేట్ ని కొన్ని నీళ్ళు తీసుకుని కలిపి పేస్ట్  లా చేసుకొని అందులో గులాబ్ జామున్ పొడి వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు కొద్దిగా పాలు కూడా వేసుకుని పిండి  కలుపుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో  రెండు గ్లాస్ ల నీళ్ళు, పంచదార   కలిసే వరకు గరిటతో తిప్పి తీగ పాకం వచ్చే వరకు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపి ఉంచుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డాల్డా వేసి కరిగి వేడయ్యాక చేసి పెట్టుకున్న ఉండలను ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వాటిని పంచదారా పాకంలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ వెరైటీ  చాకొలేట్ గులాబ్ జామున్ రెడీ.