చాక్లెట్ కేక్ పాప్స్

 

 

కావాల్సిన పదార్థాలు :

కేక్ పాప్ స్టిక్స్ లేదా లాలీ పాప్ స్టిక్స్
పౌండ్ కేక్
చాక్లెట్
ఏదైనా క్రీమ్
స్ప్రింక్లర్స్

 

తయారు చేసే విధానం :

స్టావ్ ఆన్ చేసి చిన్న మంటపై క్రీమ్ ని వేడి చేయాలి. మెల్లగా కలుపుతూ వుండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. కాస్త వేడైన క్రీమ్ లో చాక్లెట్ కలుపుకోవాలి. కొంచెం మిక్స్ చేసి 5నిమిషాల పాటూ పక్కన పెట్టేయాలి. చాక్లెట్ లో మరి కొంత భాగం మైక్రోవేవ్ లో 30 నుంచీ 40 సెకన్ల పాటూ వేడి చేసి కరిగించుకోవాలి. పూర్తిగా కరిగేదాకా మైక్రోవేవ్ లో పెడుతూ , తీస్తూ వుండాలి. వేడి కారణంగా చాక్లెట్ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రీమ్, చాక్లెట్ మిశ్రమంతో పాటూ కరిగిన చాక్లెట్ సిద్ధంగా వుంది. క్రీమ్, చాక్లెట్ మిశ్రమాన్ని గనాష్ అంటారు. అలాగే, కొన్ని రంగు రంగుల స్ప్రింక్లర్స్ కూడా రెడీగా వుంచుకోవాలి. ఇవన్నీ సిద్ధమయ్యాక ఒక పౌండ్ కేక్ తీసుకుని దాన్ని ముక్క ముక్కలు అయ్యేటట్లు పిసకాలి. ఆ ముక్కలైన పౌండ్ కేక్ లో గనాష్ కలపాలి. గనాష్ కేక్ కి బాగా పట్టేసేలాగా చేతులతో బలంగా కలపాలి. కేక్ , గనాష్ పూర్తిగా మిక్స్ అయ్యాక ఆ పదార్థాన్ని చిన్న లడ్డూల మాదిరిగా కట్టుకోవాలి. తరువాత ఆ లడ్డూ లాంటి కేక్, గనాష్ మిశ్రమాన్ని కేక్ పాప్ స్టిక్ కి గుచ్చాలి. లాలి పాప్ మాదిరిగా తయారైన కేక్ పాప్ ని కరిగించి వుంచుకున్న లిక్విడ్ కేక్ లో ముంచాలి. మరింత మంచి లుక్ , టేస్ట్ కోసం... కేక్ పాప్ ని స్ప్రింక్లర్స్ లో అద్దాలి. బాల్ లాంటి కేక్ పాప్ కి రంగు రంగుల స్ప్రింక్లర్స్ అంటుకుంటే అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. ఇలాగే ఒక్కో చాక్లెట్ ముద్దా కట్టుకుంటూ చాక్లెట్ ద్రవంలో ముంచుతూ మరిన్ని కేక్ పాప్స్ తయారు చేసుకోవాలి.