చైనీస్ చిట్టి సమోసా

 

 

కావలసిన పదార్థాలు:

మైదా                                          - రెండు కప్పులు
నెయ్యి                                         - పావుకప్పు
వెర్మిసెల్లీ                                      - ఒక కప్పు
క్యారెట్లు                                       - రెండు
క్యాప్సికమ్                                  - ఒకటి
క్యాబేజ్ తురుము                        - అరకప్పు
పచ్చి బఠాణీ                                - పావుకప్పు
తురిమిన ఉల్లికాడలు                   - పావుకప్పు
తురిమిన అల్లం                           - ఒక చెంచా
వెల్లుల్లి తురుము                         - ఒక చెంచా
పచ్చిమిర్చి తురుము                  - ఒక చెంచా
టొమాటో సాస్                             - ఒక చెంచా
మిరియాల పొడి                          - చిటికెడు
ఉప్పు                                        - తగినంత
నూనె                                        - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

మైదాలో నెయ్యి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టాలి. వెర్మిసెల్లీని ఓ క్షణం పాటు వేడి నీటిలో వేసి తీసేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేయాలి. వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేయాలి. కాస్త రంగు మారాక కూరగాయల ముక్కలు, పచ్చిమిర్చి తురుము వేయాలి. బాగా వేగిన తరువాత వెర్మిసెల్లీ, కాసింత ఉప్పు, మిరియాల పొడి, టొమాటో సాస్ వేసి మరికొన్ని క్షణాల పాటు వేయించాలి. తరువాత స్టౌ మీద నుంచి దించి చల్లారబెట్టాలి. తరువాత కలిపి పెట్టుకున్న మైదాపిండితో చపాతీలు చేసి, చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. వీటి మధ్యలో తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి, చపాతీని వేళ్లతో మధ్యకి ఒత్తి నొక్కేయాలి (ఫొటోలో ఉన్న విధంగా). వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

- Sameera