చికెన్ సీక్ కబాబ్

కావలసిన పదార్థాలు:

చికెన్ (కీమా)  - అరకిలో
పల్లీలు - అరకప్పు,
మిరియాలు - ఒక టీ స్పూను,
కారం - ఒక టీ స్పూను,
కొత్తిమీర - రెండు కట్టలు,
పుదీన - ఒక కట్ట,
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను,
గరం మసాలా - ఒక టీ స్పూను,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత,
ఫుడ్ కలర్ - కొద్దిగా,
నూనె - సరిపడా.

తయారుచేయు విధానం:
ముందుగా  చికెన్ శుభ్రం చేసి పక్కన  పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో...పల్లీలు, మిరియాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కలర్ వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసి ఓ పదిహేను నిముషాలు నానపెట్టాలి. ఈ లోపు బొగ్గుల పొయ్యి వెలిగించుకోవాలి. తరువాత మసాలాలో నానుతున్న చికెన్ కీమా ను ఒక మందపాటి ఇనుప చువ్వకు పొడవుగా  ఎనిమిది  అంగుళాల వెడల్పుతో చికెన్ మిశ్రమాన్ని  పట్టించి  బొగ్గుల సెగ మీద కాల్చుకోవాలి . అన్నివైపులా ఎర్రగా కాలాక అన్నిటిని ఒక ప్లేట్ లోకి  తీసుకోవాలి. ఉల్లిపాయ ,నిమ్మ కాయ చక్రాలతో అలంకరిస్తే చికెన్ సీక్ కబాబ్ రెడీ.....