చేమదుంపల మసాలా గ్రేవీ

 

 

 

కావలసిన పదార్థాలు :

చేమదుంపలు    -        అర కిలో
కొత్తిమీర          -       అర కప్పు ( కట్ చేసుకున్నది )
నూనె             -       తగినంత
గరం మసాలా    -       పావుటీస్పూన్
వాము           -        అరటీస్పూన్
పచ్చిమిర్చి      -       3
కారం             -      అర టేబుల్ స్పూన్
ఉప్పు            -      అరటీస్పూన్
కారం             -     అరటీస్పూన్
నిమ్మరసం       -     అర టేబుల్ స్పూన్
సెనగ పిండి      -     2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ       -     ఒకటి
ఉప్పు             -   రుచికి సరిపడా
టొమాటోలు       -   మూడు
అల్లం,వెల్లుల్లి      -   టీస్పూన్
పచ్చిమిర్చి         -  ఒకటి
వెన్న               -   2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి       -   టేబుల్ స్పూన్
యాలకులు        -   మూడు
లవంగాలు         -   నాలుగు

 

తయారుచేసే పద్ధతి :
ముందుగా చేమదుంపల్ని ఉడికించుకోవాలి . తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడి అయ్యాక కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి కొద్దిగా  నీళ్ళు పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి,కారం, లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి చిన్న మంట మీద ఉంచాలి. టొమాటోలు మెత్తగా పేస్ట్ లా అయ్యాక అందులో  వెన్న,ఉప్పు,  కసూరి మెంతి కూడా వేసి మరో రెండు నిముషాలు  ఉడికించి గ్రేవీని పక్కన ఉంచుకోవాలి. తరువాత చేమదుంపల పొట్టుతీసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్లో  ఉప్పు, కారం సెనగ పిండి చల్లి  ముక్కలన్నింటి కలపాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రీ కి సరిపడా నూనె వేసి  ముక్కల్ని వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె తీసేసి రెండుస్పూన్ల నూనె మాత్రం ఉంచి అందులో వాము, ఉల్లి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉప్పు వేసి  వేయించాలి.  తరువాత వేయించిన  ముక్కలు వేసి కొద్దిగా వేయించి తరువాత రెడీ చేసుకున్న గ్రేవీని వేసి అందులో  నిమ్మరసం, గరం మసాలా వేసి రెండు నిముషాలు ఉంచి చివరిలో కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ కర్రీ రైస్ కానీ పుల్కా కాని చపాతీ కాని ఏ కాంబినేషన్ తోనైన ట్రై చేయొచ్చు....