కాప్సికం మసాలా కర్రీ

 


 

 

 

కావలసిన పదార్ధాలు :

కాప్సికం - అర కేజీ
కారం-  తగినంత
ఆవాలు -అర టీ స్పూను
మెంతులు -అర టీ స్పూను
ఎండు కొబ్బరిపొడి-1 టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
ధనియాలు -2 టీ స్పూన్లు
తెల్ల నువ్వులు -1 టీ స్పూను
పల్లీలు - రెండు స్పూన్లు
చింత పండు - కొద్దిగా
కరివేపాకు - సరిపడా

 

తయారి విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి ధనియాలు ,పల్లీలు ,నువ్వులు ,ఎండు కొబ్బరి వేసి వేయించాలి. చల్లారాక మిక్సిలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత అదే పాన్ లో నూనె వేసి కాగాక ఆవాలు ,మెంతులు ,కరివేపాకు వేసి వేయించి కట్ చేసుకున్న కాప్సికం వేసి కొంచెం వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి . తరువాత రెడీ చేసిపెట్టుకున్నమసాలా పేస్ట్ వేసి  వేయించాలి .నూనె ఫైకి తేలాక కారం ,చింత పండు పులుసు వేసి ఉప్పు కలిపి ఉడికకించి వేయించి పెట్టుకున్న కాప్సికంను ఉడుకుతున్న మసాలా లో కలిపి ఐదు నిముషాలు ఉడికించి  స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి.