కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్

 

 

 

 


కావలసిన పదార్థాలు:
అన్నం - కొద్దిగా 
కాప్సికం -రెండు
ఎగ్స్ - రెండు 
ఉల్లిపాయలు - మూడు 
సోయా సాస్ - రెండు స్పూన్లు 
మిరియాల పొడి - కొద్దిగా 
ఉప్పు, నూనె - తగినంత

 

తయారుచేసే విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేయించుకోవాలి . ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన కాప్సికం ముక్కలని కూడా వేయాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో గుడ్లు గిలకొట్టుకోవాలి. తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కల మీద పల్చగా ఆమ్లెట్ లాగా వెయ్యాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడిని చల్లుకోవాలి. ఒక వైపు వేగాక గరిటతో బాగా కలియపెట్టి ఆమ్లెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కలిపి, సోయాసాస్ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. అంతే కాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.