బూందీ లడ్డు

 

 

కావలసినవి:
శనగపిండి - కప్పు
రవ్వ కేసరి - టీ స్పూన్
ఏలకులపొడి- చిటికెడు
బియ్యప్పిండి- టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ - చిటికెడు
ఎండు కర్బూజ గింజలు - టేబుల్‌స్పూన్
జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్
నూనె- 2 కప్పులు
పంచదార-2 కప్పులు

 

తయారి:
ముందుగా శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకుని తగినన్ని నీళ్లు పోసి పిండిని చిక్కగా జారుగా కలుపుకోవాలి. తరువాత  స్టవ్ వెలిగించి  కడాయి పెట్టి  నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి. తరువాత పక్క స్టవ్ మీద  కప్పు నీళ్లు పోసి పంచదార పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే బూందీని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి. తర్వాత  జీడిపప్పు,కర్బూజ గింజలు వేసి లడ్డూలు చేసుకోవాలి.