బ్రెడ్ కోఫ్తా కర్రీ

 

 

 

కావాల్సినవి :
బ్రెడ్ స్లైసెస్ - ఐదు
ఉల్లికాడలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
నూనె - సరిపడా
క్యాబేజి - ఒక కప్పు
బంగాళదుంపలు - నాలుగు
ఉల్లిపాయలు - రెండు
క్యారెట్ తురుము - అర కప్పు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - మూడు
సోయా సాస్ - స్పూన్
టమాట సాస్ - స్పూన్

 

 తయారుచేయు విధానం:
ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టి, పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, బంగాళ దుంప ముక్కలు, క్యాబేజి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇది కర్రీలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక  ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి నీళ్ళల్లో ముంచి వెంటనే తీసి రెండు అరిచేతుల మద్య పెట్టి నీటిని గట్టిగా పిండాలి. తరువాత ఒక్కో స్లైస్ పైన  ఉండను ఉంచి చుట్టూ మూసెయాలి. తరువాత పాన్ లో నూనె వేసి వేడి చేసి రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉండలని వేయించి ప్లేట్ తీసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై వేరొక  గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు, సోయా సాస్, టమోట సాస్, వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉండలు వేసి వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.