బ్రెడ్ హల్వా

 

 

 

కావలసిన పదార్థాలు:

 బ్రెడ్ - 1 ప్యాకెట్

నెయ్యి - ఒక కప్పు 

ఏలకులు - 5- 6

బాదం పప్పులు - 10 నానబెట్టి, సన్నగా తరిగినవి.

కాజూ - 7 లేదా 8  

పంచదార - ఒకటిన్నర కప్పు

పాలు - ఒక లీటరు

 

తయారీ విధానం:

బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

ఒక అరకప్పు నేతిని బాణెలిలో తీసుకోని, కొంచం వేడి అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించుకోవాలి.

బాదం, ఏలకులు, జీడిపప్పు సగం తీసుకోని ముద్దగా చేసుకోవాలి, మిగతావి నేతిలో వేయించికోవాలి.

పాలను ఒక గిన్నెలో తీసుకొని, మరగబెట్టి, దానికి పంచదారను కలపాలి. అది బాగా కలిసేంతవరకు కలియబెట్టుకోవాలి.

పంచదార బాగా కలిసిన తర్వాత, దీనికి మిగిలిన నెయ్యి, వేయించిన బ్రెడ్ ముక్కలు కలపాలి.

సన్నని సెగపై ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మెత్తగా ఉడకనివ్వాలి. దీనిలో ఇప్పుడు జీడిపప్పు ముద్దను వేసి, కలుపుకోవాలి.

స్టవ్వు మీద నుండి తీసుకొని జీడిపప్పు, బాదం, ఏలక్కుల పొడి చల్లుకోవాలి.