బొంబాయిరవ్వ వడియాలు

 



కావలసినవి:

బొంబాయిరవ్వ-250 గ్రాములు
నువ్వులు - అర కప్పు
సగ్గుబియ్యం -అర కప్పు
ఉప్పు- తగినంత
తయారీ :


ముందు రోజు రాత్రి సగ్గుబియ్యాన్ని నీళ్లల్లో నానపెట్టాలి. మర్నాడు ఒక గిన్నెలో గ్లాస్‌ రవ్వకి రెండు గ్లాస్‌ల చొప్పున నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతున్నపుడు అందులో రవ్వ, ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేసుకోవాలి. చల్లారాక ఒక కవర్‌పై ఈ మిశ్రమాన్ని స్పూన్ తో వడియాలు పెట్టుకోవాలి.. పూర్తిగా ఎండిన తరువాత జాగ్రత్తగా తీసి పొడిగా ఉన్న సీసాలో భద్రపరచుకోవాలి.