బిస్కట్ కేక్స్

 

 

ఆదివారం స్నాక్ టైం అమ్మలకి పెద్ద పరీక్ష...కొత్త గా ఏమన్నా చెయ్యు ..అంటారు . అలా మొన్న ఆదివారం ఈ బిస్కెట్ కేక్ చేసాను. త్వరగా అయపోయింది. టేస్ట్ కూడా సూపర్ గా వుంది.

 

కావలసిన పదార్ధాలు

బిస్కెట్స్ ...ఓ పది దాకా
కోకో పౌడర్ ....రెండు చెమ్చాలు
షుగర్ పౌడర్ ...మూడు చెమ్చాలు
పాలు           ....అర కప్పు
చాక్లెట్             పావు కప్పు

 

తయారి విధానం

ముందుగా కోకో పౌడర్ , షుగర్ పౌడర్ , కోకో పౌడర్ కలిసేంత   పాలు పోసి  బాగా కలిపి , తక్కువ మంట మీద పెట్టాలి . ఒక అయిదు నిమిషాలకి కొంచం చిక్క బడుతుంది మిశ్రమం. ఆ తర్వాత ఒక బిస్కెట్ ని పాలలో ముంచి ఒక ప్లేట్ లో పెట్టాలి. దాని మీద కోకో పౌడర్ మిశ్రమాన్ని ఒక స్పూన్ తో స్ప్రెడ్ చేయాలి. దాని మీద మళ్ళి మరో బిస్కెట్ ని పాలలో ముంచి పెట్టాలి ..దాని మీద కోకో మిశ్రమం..రాయాలి. ఇలా మొత్తం అన్ని బిస్కెట్స్ ని ఒక దాని మీద ఒకటి పెడుతూ వెళ్ళాలి. ఆఖరు బిస్కెట్ మీద కోకో మిశ్రమం రాయకూడదు.

ఇప్పుడు ఆ బిస్కెట్స్ ని ఫ్రిజ్ లో ఒక అరగంట పాటు పెట్టాలి. కోకో మిశ్రమం బిస్కెట్స్ కి గట్టిగా పట్టి వుంటుంది. ఇప్పుడు చాక్లెట్ ని డబల్ బాయిల్ చేస్తే ..కరుగు తుంది. ఆ కరిగిన  చాక్లెట్ ని బిస్కెట్ మిశ్రమం మీద పోసి , చుట్టూ కూడా కవర్ అయ్యేలా ఒక చాకు తో రాయాలి . మొత్తం బిస్కెట్ మిశ్రమం అంతా చాక్లెట్ తో కవర్ అయ్యాక తిరిగి ఫ్రిజ్ లో పెట్టి ఒక అరగంట ఉంచితే చాక్లెట్ మిశ్రమం గట్టి పడుతుంది . ఒక కేక్ షేప్ లో వస్తుంది. దానిని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి ..అంతే..స్టవ్ తో పని లేని ..సింపుల్ అండ్ యమ్మి కేక్ రెడీ ...