క్యాప్సికం బెండకాయ కర్రీ

 

 

కావలసినవి :
క్యాప్సికం - అరకేజీ
బెండకాయలు - అరకేజీ
జీలకర్ర - అర స్పూన్
ఇంగువ-చిటికెడు
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
అల్లం, పచ్చిమిర్చి ముద్ద- రెండు స్పూన్లు
పసుపు - చిటికెడు
ధనియాలపొడి - ఒక స్పూన్
జీలకర్ర పొడి-ఒక స్పూన్
ఎండు కొబ్బరి తురుము-అరకప్పు
కొత్తిమీర కట్టలు-రెండు
ఉప్పు - తగినంత
టమాటాలు-రెండు
నూనె - తగినంత

 

తయారుచేసే విధానం :
ముందుగా క్యాప్సికం, బెండకాయలు కడిగి  సన్నగా పొడవుగా తరిగి, చిన్న మంట మీద నూనెలో వేయించాలి. ఇప్పుడు మరో బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఇంగువ, పసుపు, జీలకర్ర, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేసి సన్నగా తరిగిన టమాట ముక్కలు, ఉప్పు, కారం, అల్లం పచ్చిమిర్చి ముద్ద, కొబ్బరి తురుము వేసి వేయించి కొంచంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు బెండకాయ, క్యాప్సికం ముక్కలు వేసి మూతపెట్టాలి. పది నిముషాలు మగ్గనిచ్చి చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి క్యాప్సికం బెండకాయ కర్రీ రెడీ....