బెండకాయ కుర్మ

 

 

 

కావలసినవి :
బెండకాయలు : పావుకేజీ
ఉల్లిపాయ : రెండు
కరివేపాకు : కొద్దిగా
పసుపు :చిటికెడు
టమాటాలు : రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు : ఒక స్పూన్,
ఆవాలు : ఒక స్పూన్
ధనియాల పొడి : ఒక స్పూన్
కారం :ఒక స్పూన్,
ధనియాల :ఒక స్పూన్,
కొబ్బరి తురుము :ఒక  స్పూన్
నూనె : తగినంత

 

తయారు చేసే విధానం:

 

ముందుగా బెండకాయలను  కడిగి ఆరబెట్టి తడి ఆరాక కావలసిన సైజ్ లో కట్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే  పాన్ నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్  వచ్చేవరకి వేయించి, తరిగిన టమాటాలు, కారం , ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆ తరువాత తరిగిన బెండకాయ ముక్కలను వేసి కలిపి రెండు నిముషాలు ఆగి కొబ్బరి తురుము సరిపడా నీళ్ళు పోసి పది  నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్  బౌల్  లోకి తీసుకోవాలి...