బీట్‌రూట్ పచ్చడి

 

 

 

కావలసిన వస్తువులు:
బీట్‌రూట్ - పావు కిలో
మిరపకాయలు - 10
పోపు గింజలు - తగినన్ని
వెల్లుల్లి రెబ్బలు - 6
ఉప్పు - తగినంత
చింతపండు - కొంచెం
పసుపు - కొంచెం
నూనె - 3 టీ స్పూన్లు

 

తయారీ విధానం:

 

బీట్‌రూట్ చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. బాణలీలో నూనె వేసి కాగాక పోపు గింజలు వేసి, మిరపకాయలు వేసి వేగాక పక్కన పెట్టుకోవాలి. బాణలీలో బీట్‌రూట్ తురుము వేసి తక్కువ సెగమీద పచ్చిదనం పోయేవరకూ వేయించి తీసి, ఉప్పు, పసుపు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బి తీసుకుంటే కమ్మకమ్మటి బీట్‌రూట్ పచ్చడి రెడీ. చివరిగా పోపు వేసి పచ్చడి మీద వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది.