కలరఫుల్ బీట్రూట్ దోస

 

 

ఒంట్లో హిమోగ్లోబిన్ తక్కువైన వాళ్ళని ఎక్కువగా బీట్రూట్ గాని కేరట్  గాని తినమంటారు కదా. అలాంటివాళ్ళు మాత్రమే కాదు మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవరందరూ ఈ దోస తినచ్చు.

కావలసిన పదార్థాలు :

బీట్ రూట్ ముక్కలు - 2 కప్పులు
బియ్యప్పిండి - 1 కప్పు
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర - 1/4 టీస్పూన్
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :

ఈ దోసెల కోసం ముందుగా బీట్ రూట్ ముక్కల్లో, జీలకర్ర తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి.తరువాత నీళ్ళు వంపేసి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ రుబ్బిన మిశ్రమంలో బియ్యప్పిండి, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి బీట్ రూట్ పిండిని గరిటెతో తీసుకొని పెనం మీద వేసి దోసెలాగా వెయ్యాలి. ఒకవైపు కాలాకా రెండో వైపు కూడా అలానే కాలనిచ్చి తీయాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా దసలు వేసుకుని వేడివేడిగా ఏదైనా చట్నీతో కలిపి తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.   

                                                                                                                                                                                                                  .....కళ్యాణి