బీరకాయ మసాలా కర్రీ

 

 

 

 కావలసినవి :
బీరకాయలు : అర కేజీ
లవంగాలు :  2
పసుపు : అర స్పూన్
యాలకులు : మూడు
దాల్చిన చెక్క : అంగుళం ముక్క
పచ్చిబఠాణీలు :50 గ్రాములు
కారం : రెండు స్పూన్
టమోటలు : 2
ధనియాలు : 2 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్లు
ఉల్లిపాయలు : 2
నూనె :తగినంత

 

తయారు చేయు విధానం :
ముందుగా బీరకాయల చెక్కుతీసి చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి. తరువాత ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను నీళ్ళు వేయకుండా మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు  స్టవ్‌ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయలు వేసి వేగాక  బీరకాయ ముక్కలు, టమోట ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠాణీలు వేసి కాసేపు వేయించి సరిపడా  నీళ్ళుపోసి ఉడికించాలి. పది నిముషాల తరువాత  రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ను వేసి మరో పది నిముషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్  బౌల్  లోకి తీసుకోవాలి.