బందర్ లడ్డు

 

 

కావలసినవి:
శనగపిండి : 1 కప్పు
నెయ్యి : పావు కేజీ
జీడిపప్పు : సరిపడా
పంచదార : ఒక కప్పు
కుంకుమపువ్వు : సరిపడినంత

 

తయారీ విధానం :
ముందుగా శనగపిండిని తీసుకుని దానికి సరిపడా నీరు కలిపి ముద్దచేసి దానిని కారప్పూసలాగా వేసుకుని ప్లేట్లోకి  తీసుకోవాలి.ఇప్పుడు కారప్పూసను  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  ఒక గిన్నె తీసుకుని దానిలో పంచదార వేసి, 1/4 th కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి ఆ నీటిని షుగర్లో కలిపి సరిపడా  నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి.   ఈ పాకంలో మనం తయారుచేసుకున్న పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి . తరువాత నెయ్యిలో వేయించిన జీడిపప్పులను , యాలకుల పొడిని తయారు చేసుకుని వీటిని కలుపుకున్న ముద్దలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజ్ లో ఉండలుగా చేసుకోవాలి.అంతే బందర్ లడ్డులు రెడీ....