బేబీకార్న్ పన్నీర్‌  కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్‌  - 100 గ్రాములు
పన్నీర్‌ ముక్కలు - కప్పు
ఉల్లిపాయ - 2
దాల్చినచెక్క -అంగుళం ముక్క
పసుపు-చిటికెడు
ఉప్పు-  సరిపడా
కొత్తమీర - కొద్దిగా
నూనె- తగినంత
కారం-టీస్పూను
ధనియాలపొడి- టేబుల్‌ స్పూను
పచ్చిమిర్చి- మూడు
లంవగాలు- మూడు
టమోటాలు - 3

 

తయారుచేసే విధానం :
ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి  వేయించాలి. తర్వాత లవంగాలు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, టమాటా, పన్నీరు ముక్కల్ని వేసి కలిపి మూతపెట్టి పది  నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు కట్ చేసిన బేబీ కార్న్‌ ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు, కారం ధనియాల పొడి వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి నీళ్ళు మొత్తం ఇగిరి పోయే దాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర తో గార్నిష్ చేసుకుని వేడి వేడి రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేసుకోవాలి.