ఆలూ పరోటా

 

 

 

కావలసిన పదార్థాలు :

ఆలు (బంగాళాదుంపలు)           : 3
ఉల్లిపాయి ముక్కలు                  : 1/4 కప్పు
పచ్చిమిర్చి                               : 1
వాము                                     : 10 గింజలు
ఉప్పు                                      : 1/2 చెంచా
కొత్తిమీర సన్నగా తరిగినది        : కొద్దిగా
నూనె లేక బటర్                       : 1/4 కప్పు
చపాతి పిండి                             : 1 కప్పు

 

తయారుచేసే విధానము:

* ముందుగా కుక్కర్‌లో సగానికి కోసిన ఆలుగడ్డలు ఉడికించి పొట్టుతీసి ప్రక్కనపెట్టుకోవాలి.

* చపాతీ పిండిలో చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి పరోటాల కొరకు మెత్తగా పిండి కలుపుకోవాలి.

* ఉల్లిముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం కొత్తిమీరతరుగు అన్నీ కలుపుకుని బాగా అదిమిన ఆలుగడ్డల ముద్దలో కలుపుకోవాలి... ఆలుగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకున్నట్లైతే చేతితో లేక గ్రీటర్‌తో మెత్తగా అదమవచ్చును.

* ఈ ముద్దని చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న పరోటా మధ్యలో పెట్టి ముట్టు మూసివేసి ఆ ముద్దను చేతితో బిళ్ళలా అదిమి అప్పడాల కర్రతో మెల్ల మెల్లగా బత్తుకుని పెనంపై చిన్నమంటతో దోరగా కాలేలా నూనె (లేక) బటర్ రాస్తూ కాల్చుకోవాలి.

* ఈ ఆలూ పరోటాలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి. వీటికి కూర అవసరంలేదు. కమ్మని పెరుగు కొద్ది పచ్చడి (లేక) సాస్‌తో తింటే ఎంతో బావుంటాయి.

 

- భారతి