బంగాళదుంప పకోడి

 


అసలే వర్షాలు. ఈ కూల్ క్లైమేట్ కి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా. కానీ వర్షాల వల్ల బయటకి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. అలాంటప్పుడు మన వంటింట్లో ఉండే కూరగాయలతోనే ఒక మంటి ఐటమ్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈసారికి బంగాళ దుంప పకోడి చేసుకొని తినేయండి. మరి దానికి కావలసని పదార్ధాలు..

బంగాళదుంపలు                - అరకిలో 

నూనె                              - పావుకిలో 

శెనగపిండి                        - 5 స్పూన్లు

కార్న్ ప్లోర్                        - 5 స్పూన్లు

అల్లం, వెల్లుల్లి                    - 2 స్పూన్లు

గుడ్లు                               - ౩ 

తాలింపు , పచ్చిశెనగపప్పు    - 2 స్పూన్లు

ఛాయమినపప్పు                  - 2 స్పూన్లు

ఆవాలు                             - 1 స్పూన్

జీలకర్ర                              -  1 స్పూన్

కరివేపాకు                          - 2 రెబ్బలు 

రెడ్ కలర్                            - చిటికెడు 

టేస్ట్ ఇన్ సాల్ట్                       - చిటికెడు 

ఉప్పు                                   - 1 స్పూను 

 

తయారుచేసే విధానం : 

* బంగాళాదుంపలు శుభ్రంగా కడుక్కొని తోక్కతీసి అంగుళం సైజులో  చిన్న స్య్వేర్క్ గా  ముక్కలు తరుక్కోవాలి.  

* ఇప్పుడు గిన్నెలో ఈ ముక్కలు వేసి నీళ్ళుపోసి  2 నిమిషాలు ఉడకబెట్టి దింపి, నీళ్ళు వార్చాలి. 

* మరోగిన్నెలో శెనగపిండ, కార్న్ ప్లోర్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, రంగు, టేస్ట్ ఇన్ సాల్ట్, గుడ్ల సొన, ఉప్పు వేసి కలుపుకుని చివరగా  బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి  2 నిమిషాలు నాననివ్వాలి. 

* బాణలీలో నూనెపోసి కాగాక కలిపిన పిండితో పకోడిలా వేసుకోవాలి. ఛాయమినపప్పు, పచ్చిశేనగపప్పు, ఆవాలు, జీలకర్ర , కరివేపాకుతో తాలింపు పెట్టి  ఆ పకోడీల మీద వేయాలి. అంతే టేస్టీ బంగాళదుంప పకోడి రెడీ..