ఆలూ బఠానీ కర్రీ

 

 

 

కావాల్సిన పదార్ధాలు :
ఆలు - రెండు
వంకాయలు - అర కేజీ
బఠాణీలు - ఒక టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
జీలకర్ర - ఒక టీ స్పూన్
పచ్చిమిరపకాయలు - 6
అల్లం - అంగుళం ముక్క
కరివేపాకు - 4రెమ్మలు
నూనె -  సరిపడా
సెనగపిండి - ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు - అర టేబుల్ స్పూన్
మెంతులు - 4 గింజలు
ఆవాలు - అర టీ స్పూన్
ఇంగువ - అర టీ స్పూన్
ఎండుమిరపకాయలు - 5
సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - ఒక టీ స్పూన్

 

తయారు చేసే విధానం :
ముందుగా కూరగాయలను  ముక్కలని అన్నింటిని విడిగా  కట్ చేసుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని పెట్టి అందులో నూనె పోసి కాగాక మినపపప్పు ,సెనగపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ,పసుపు,జీలకర్ర,ఎండుమిరప ముక్కలు వేసి వేగిన తరువాత  బఠానీలు ,ఉప్పు,కరివేపాకు వేసి ఒక ఐదు నిముషాలు వుంచి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత సరిపడా  నీళ్ళు పోసి మూత పెట్టాలి. 20 నిముషాల తర్వాత  అల్లం ,పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగా కలిపి చివరిలో  సెనగ పిండిని వేసి  కలిపి ఐదు నిముషాలు వుంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి....