ఆలు టిక్కి ఛోలే ఛాట్

 

 

 

ఆలు టిక్కి ఛోలే ఛాట్ ఉత్తర భారతంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్. దీనిని కొత్తిమీర-పుదీనా చట్నీ, డేట్స్ చట్నీ, కీరా రైతాతో తింటే చాలా బావుంటుంది. పిల్లలకు ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఓసారి ఈ స్నాక్ చేసి చూడండి.

 

ఆలు టిక్కి చేయడానికి కావల్సిన పదార్ధాలు:
ఆలు - మూడు
బ్రెడ్ - రెండు స్లైస్ లు
కారం - అర చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - చిటికెడు
మిరియాల పొడి - రుచికి తగినంత
నూనె - చిన్న కప్పుడు

 

 

ఛోలే చేయడానకి కావల్సిన పదార్ధాలు:
నానబెట్టిన కాబూలి శెనగలు - ఒకటిన్నర కప్పు
గరం మసాలా - ఒక చెంచా
కారం - ఒక చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
ఛోలే మసాలా - ఒక చెంచా
పసుపు - తగినంత
ఉప్ప - తగినంత
ఉల్లి తరుము - ఒక కప్పుడు
టమాటా ముక్కలు - ఒక కప్పుడు

 

 

 

టిక్కి తయారీ విధానం:
ఒక కప్పులో ఉడికించి చెక్కుతీసిన ఆలూ, బ్రెడ్, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి మెత్తగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి రెండు చేతుల మధ్య పెట్టి నెమ్మదిగా వత్తితే టిక్కిలా వస్తుంది (ఆలు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె రాసుకోవాలి చేతులకి). ఇలా చేసిన టిక్కిలను పెనం మీద నూనె వేసి ఎర్రగా కాల్చాలి.

 

 

 

ఛోలే తయారీ విధానం:
నానబెట్టిన శెనగలని ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు బాణిలో నూనె వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేయించాలి. ఆ తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, చోలే మసాలా, ధనియాలపొడి వేసి బాగా కలిపి తగినంత ఉప్పుచేర్చి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శెనగలను కూడా చేర్చి కలిపి ఓ పావుగంట సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ఛోలే సిద్దమవుతుంది.

 

 

 

వడ్డించే విధానం:
ముందుగా ప్లేటులో ఆలు టిక్కిని పెట్టి పైన ఛోలే వేయాలి. పైన కొత్తిమీర-పుదీన చట్నీ, స్వీట్ చట్నీ వేసి ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే ఆలు టిక్కి ఛోలే ఛాట్ రెడీ. టిక్కితో పాటు ఛోలే తింటే చాలా రుచిగా ఉంటుంది.

 

 

 

-రమ