వరలక్ష్మీ వ్రతం స్పెషల్

 

 

 

పరమాన్నం

 

 

కావలసినవి :
బియ్యం - ఒక కప్పు
సగ్గుబియ్యం - అర కప్పు
పాలు - రెండు కప్పులు
నీళ్ళు - ఒక కప్పు
జీడుపప్పు - కొంచం
బాదాంపప్పు - కొంచం
కిస్మిస్స్ - కొంచం
నెయ్యి - రెండు స్పూనులు
పంచదార - కప్పున్నర

 

తయారీ :
ముందుగా సగ్గుబియ్యం ,  బియ్యం కడిగి పాలు , నీళ్ళు పోసి ఉడకపెట్టాలి . కొంచం ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి ఒక పది నిముషాలు ఉండనివ్వాలి ఈలోపు  వేరే పాన్ లో నెయ్యి వేసి దాన్లోకి బాదాం, కిస్మిస్స్,జీడిపప్పు వేపి వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని ఉడుకుతున్న పరమాన్నం లోకి వేసి స్టవ్ ఆఫ్ చేసి  వేడి వేడి పరమాన్నం భగవంతుడి కి నివేదన చేసి తినాలి.

 

*****

 

రవ్వ బూరెలు

 

 

 

కావలసినవి :
బొంబాయి రవ్వ -  పావు కేజీ
పంచదార - పావుకేజీ
మినపపప్పు - పావుకేజీ
బియ్యం - అరకేజీ
ఏలకులపొడి - 1 స్పూన్
నూనె - సరిపడా
జీడిపప్పు,కిస్మిస్ తగినంత 
నెయ్యి - తగినంత 

 

తయారీ:  బియ్యం,మినపప్పు ముందు రోజు రాత్రి నానపెట్టి కడిగి  మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి  నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి రవ్వ కూడా వేసి  వేయించి  పెట్టుకోవాలి ఇంకో గిన్నెలో పంచదార వేసి కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పంచదార కరిగి పాకం వచ్చాక రవ్వ  వేసి ఉడికించాలి ఇప్పుడు మిశ్రమం గట్టిగ అయ్యేక నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి  . ఇప్పుడు పక్క  స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె  పోసి కాగనివ్వాలి ఇలోపు చల్లారిన మిశ్రమంను చిన్న ఉండలు చేసి గ్రైండ్ చేసిపెట్టుకున్న మినపప్పు,బియ్యం  పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రయ్ చేసుకుని ప్లేట్ లో తీసుకోవాలి.

 

*****

 

మినప గారెలు

 

 

 

కావలసినవి :
మినపపప్పు - అరకేజీ
పచ్చిమిర్చి - 5
ఉల్లిపాయలు - 1
ఉప్పు - సరిపడ
నూనె - అరకేజీ
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 2 స్పూన్స్

 

తయారివిధానం :
నాలుగుగంటల  ముందు మినపపప్పును నానబెట్టాలి. నానిన ఈ పప్పును బాగా కడిగి    బరకగా, గట్టిగా  ఉండేలా  గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి,  ఉప్పు,  జీలకర్రలను  మిక్సీచేసి  పై  మిశ్రమంలో  కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి  పెట్టి  నూనె  పోసి  వేడిచేయాలి. ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకోని వడల్లా చేసి మధ్యలో  రంద్రం  పెట్టి  కాగిన  నూనెలో  వేసి  గోల్డ్ కలర్ వచ్చే  వరకు  వేయించి బౌల్ లోకి తీసుకోవాలి.

 

రకరకాల పులిహోరలు ...