పన్నీర్ కార్న్ సమోసా

 

 

 

 

కావలసిన పదార్థాలు :
పన్నీర్ : చిన్న కప్పు
స్వీట్ కార్న్ : ఒక కప్పు
మైదా : రెండు కప్పులు
కొత్తిమీర తురుము : ఒక కప్పు
గరం మసాల : ఒక టీ స్పూన్
నూనె :  సరిపడ
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడ
నెయ్యి : రెండు టీ స్పూన్స్

 

తయారు చేయు విధానం :
ముందుగా మైదా పిండిలో కొంచెం నూనె, తగినంత ఉప్పు, నీళ్ళు వేసి కలిపి అరగంట సేపు నాననివ్వాలి. స్వీట్ కార్న్ ను ఉడికించుకుని  కొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత పన్నీర్ కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్  పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్, కట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, అల్లంవెల్లులి పేస్ట్ ను వేసి మరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొత్తిమీరను వేయాలి. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిని మీడియం సైజు ముద్దలుగా చేసి చపాతీలా చేసుకోవాలి. మొత్తం అలా చేసుకున్న తర్వాత వాటిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చపాతీలకు చుట్టు నెయ్యిని రాసి సమోసా ఆకారంలో మడుచుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని సమోసా విడిపోకుండా మడుచుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి కాగాక  రెడి చేసుకున్న సమోసాలను వేయించుకుని సాస్ తో కాని చట్నీ తో కాని సర్వ్ చేసుకోవాలి...