బెండకాయ గ్రేవీ కర్రీ

 

 

 

కావలసిన పదార్ధాలు :
బెండకాయలు -1/4 కిలో
కొత్తిమీర -1/2కప్పు
ఉల్లిపాయలు -6
అల్లం వెల్లుల్ల్లి ముద్ద -1 టీ స్పూను
గరం మసాలా -2 టేబుల్ స్పూన్లు
ఉప్పు -రుచికి తగినంత .
శెనగ పిండి -1 టేబుల్ స్పూను
నూనె -వేయించడానికి తగినంత .
టమాటో - పావు కిలో
బట్టర్- 50 గ్రాములు
కారం పొడి -2 టేబుల్ స్పూన్లు
ఛాట్ మసాలా -1 టీ స్పూను
జీడిపప్పులు- కొద్దిగా
ఎండు మిర్చి -6
పుదీనా- 2కప్పులు

 

తయారు చేసే పధ్ధతి:
ముందుగా  బెండకాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మద్యలో చిన్నగాటు పెట్టాలి.అందులో  ఛాట్ మసాలా  పొడి,కారం  కలిపి కట్ చేసుకున్న ముక్కల్లో పెట్టి పైన  శెనగ పిండి చల్లి  స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కాక బెండకాయ ముక్కలు  వేయించి తీసి ప్లేట్ లో పెట్టాలి . తరువాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో  టమాటో ముక్కలు ,ఎండు మిరపకాయలు ,గరం మసాలా ,పుదీనా ఉడికించాలి. ఇప్పుడు  ఉడికించుకున్నవాటిని మిక్సిలో వేసి పేస్ట్ చేసుకోవాలి .స్టవ్ వెలిగించి అదే పాన్ లో నూనె వేసి  ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి . తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి వేయించుకోవాలి ఇప్పుడు  టమాటో కూడా  వేసిపది నిముషాలు వేయించాలి .జీడిపప్పుని పేస్ట్ కూడా  వేసి గ్రేవీ చిక్కబడిన తరువాత  బట్టర్ ని వేసి సాల్ట్ వేసి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు  వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. బెండకాయ మసాలా గ్రేవీ  రెడీ