బీట్‌రూట్ పాఠోళీ

 

 

 

కావలసినవి:
బీట్‌రూట్  - 1
శనగపప్పు - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
అల్లం - చిన్నముక్క
పసుపు - తగినంత
పచ్చిమిర్చి - 3
ఆవాలు, జీలకర్ర
ఉప్పు -  తగినంత
నూనె - తగినంత
శనగపప్పు - ఒక స్పూన్
మినప్పప్పు - టీస్పూను
ఎండుమిర్చి - 2
కరివేపాకు - సరిపడా

 

విధానం:
ముందుగా శనగపప్పును రెండు గంటల ముందు నానబెట్టి  శుభ్రంగా కడిగి  అందులో  పచ్చిమిర్చి, అల్లం కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని  కుకర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాకా  మిశ్రమాన్ని చిదుముకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని కూడా  ఉడికించాలి. ఇప్పుడు  పాన్ తీసుకుని నూనె వేడి చేసి, పోపు దినుసులు వేసి వేయించి కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయతరుగు, పసుపు వేసి వేయించాలి. తరువాత ఉడికించిన బీట్‌రూట్, శనగపప్పు మిశ్రమం, ఉప్పు వేసి ఐదు నిముషాలు వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి...