KIDS TALENT
బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

  • యునైటెడ్ తెలుగు ఫోరం ప్రకటన
  • అభినందించిన భారత రాయబారి సతీష్ చంద్ర
  • త్వరలో అధికారుల సమక్షంలో అందజేత

కువైట్ లో భారత రాయబారిని కలిసిన ఫోరం సభ్యులు

అంతర్వేది, న్యూస్ లైన్: ఇటీవల కువైట్ లో హత్యకు గురైన వారి కుటుంబాలకు యునైటెడ్ తెలుగు ఫోరం ఆర్థిక సాయం ప్రకటించింది. బుధవారం ఆ దేశంలో సమావేశమైన ఫోరం సభ్యులు హత్యకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానించినట్టు కన్వీనర్ కొల్లాబత్తుల వీర్రాజు ఈ మెయిల్ ద్వారా తెలిపారు.

అంతకుముందు ఫోరం సభ్యులు కువైట్ లో భారత రాయబారి సతీష్ చంద్ర మెహతాను కలిసి తెలుగు వారి సమస్యలను వివరించారన్నారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులను ఆయన అభినందించారన్నారు, ఇటీవల కువైట్ లో పిలిప్పెన్ దేశస్తురాలి చేతిలో హత్యకు గురైన సఖీనేటిపల్లి మండలం ఉయ్యూరివారిమెరకకు చెందిన గోడ కుమారికి, ఒంటెలు తొక్కి చనిపోయిన కడప వాసి కృష్ణమయ్య కుటుంబాలకు రు:1.25 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇక రంజాన్ నెలలో కువైట్ కాల్పుల్లో మరచించిన వైఎస్సార్ జిల్లాకు చెందిన తోకల నరేష్ కుమార్, ఎన్. రాయణయ్య, ఎం. ఓబుల్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ కు చెందినా పరశురాంకు రు: 1.5 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 8.5 లక్షలను ఆయా గ్రామాల్లోని తమ ప్రతినిధులకు అందజేశామన్నారు.

త్వరలో అధికారుల సమక్షంలో ఈ సాయం అందజేస్తామని వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళాసమితి. ప్రవాసాంధ్ర తెలుగుదేశం, అరబ్, టు ఏపీ, తెలుగు క్రెస్తవ సంఘాలు, తెలుగు ముస్లిం సంఘం, లలిత కళాసమితి, ఆదర్శ ఆంధ్రాయూత్, మహాత్మాగాంధీ సంక్షేమ సంఘం, కళాంజలి మయూరి గ్రూప్, ఆల్ బదియా గ్రూపు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;