RELATED NEWS
NEWS
అమెరికా లో తెలంగాణ యువ‌కుడి సాహ‌సం...

 

 

అమెరికా లో తెలంగాణ యువ‌కుడి సాహ‌సం...

14,500 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్

అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ యువ‌కుడు సాహ‌సం చేశాడు. 14,500 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసిన విలాస్‌రెడ్డి అనే యువ‌కుడు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తూ అక్క‌డే స్థిర‌ప‌డిపోయినప్పటికీ త‌న‌ మాతృదేశ ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు.  స్కై డైవింగ్ అనేది అమెరికా లో ఒక సహస క్రీడ , ఆకాశం లో 14,500 అడుగుల ఎత్తునుంచి విమానంలో నుండి దూకడం , అక్కడ 2 నిమిషాల పాటు  "ఫ్రీ ఫాల్" అంటే ఎలాంటి ప్యారాచ్యుటు లేకుండా దిగటం , మిగితా 5 నిమిషాల పాటు  ప్యారాచ్యుటు సహాయము తో దిగటం.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ కి రావడం . అదేవిధముగా త్వరలో ఇండిపెండెన్స్ పరేడ్ రాబొవుతుండడం తో తన వంతు గా జాతీయ పతాకం తో మరియు మోడీ గారి టీ - షర్ట్ వేసుకొని ఈ సహస విన్యాసం లో పాల్గొన్నారు. అందులో భాగమంగా తను చేస్తున్న పలు సేవ కార్యక్రమాలు , వీ ఫర్ ఎడ్యుకేట్, ఙ్నాన సరస్వతి ఫౌండేషన్ , తెలంగాణ రైతులకు మద్దతు గా  స్కై డైవింగ్ చేస్తూ  జై తెలంగాణ, వందేమాత‌రం, భార‌త్ మాతాకీ జై నినాదాలు చేశాడు.

 

 

కొత్త రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించాడు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య మరింతగా స‌త్సంబంధాలు బాగుండాలని "గాడ్ బ్లేస్ అమెరికా" అంటూ  నినాదాలు, అక్కడ ఉన్న అమెరికా పౌరులు కూడా చాల అభినందించారు. తన స్కై డైవింగ్ భాగం లో ప్రమాదవశాత్తు ఏమి జరగకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ,  అందులో భాగముగా తను పుట్టిన దేశానికి , తల్లిదండ్రులకి , కుటుంబ సభ్యులకి  మరియు మిత్రులకి తన సంతోషాన్ని తెలియపరిచాడు  కొసమెరుపు : ఇలాంటి  స్కై డైవింగ్ చేసినప్పుడు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్సు వర్తించదు , ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది , ఏది ఏమైనప్పటికి ఒక తెలుగు పౌరుడు ఇలా చేయడం అభినందనీయం , గుడ్ లక్ విలాస్.



TeluguOne For Your Business
About TeluguOne
;