RELATED NEWS
NEWS
యోగా దినోత్సవ పాటకు తెలుగువారి బాణి

 ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవానికి సమాయత్తమైన ఈ రోజు ఈ తరుణంలో తెలుగువారికి ఓ శుభవార్త.. యోగా దినోత్సవ గీతానికి ఇద్దరు తెలుగువారు బాణి కట్టారు. అమెరికాలో నివసించే తెలుగువారు కశ్యప్ వెణుతురుపల్లి, అనన్య పెనుగొండ అనే యువ గాయకులు ప్రపంచ యోగా దినోత్సవ గీతానికి చక్కటి సంగీతాన్ని అందించారు. 'యోగా డే' సందర్భంగా అమెరికాలోని ఇండియా ఎంబసీ ద్వారా యోగా పాటకు బాణి కట్టమని ఇచ్చిన పిలుపుకు స్పందించి కశ్యప్, అనన్య మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఇప్పుడు ఈ పాట యోగా డే నాడు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. కశ్యప్, అనన్య కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే యోగా డే సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేసే బాధ్యతను అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఓ పోటీలా నిర్వహించింది. తెలుగు నేలపై పుట్టిన కశ్యప్, అనన్య ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుని యోగా డే సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. నాట్స్ వాషింగ్టన్ ఛాప్టర్ లో యూత్ కమిటీ సభ్యులుగా కూడా పని చేస్తున్న కశ్యప్,అనన్య లు భారతీయ కళలు, సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్నారు.

చిన్ననాటి నుంచే సంగీత సాధన చేశారు. అనన్య ఈటీవీ పాడుతా తీయగా పోటీల్లో సెమీ ఫైనల్ దాకా వెళ్లారు. చక్కటి గాత్రంతో పాటు సంగీతంపై కూడా పట్టు సాధించిన అనన్య, కశ్యప్ తో కలిసి యోగా డేకు మ్యూజిక్ ను కంపోజ్ చేశారు. చిన్న వయసులోనే ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న కశ్యప్, అనన్యలను నాట్స్ అభినందిస్తోంది. మొత్తానికి తెలుగువారు సంగీతమందించిన యోగా గీతం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది .

TeluguOne For Your Business
About TeluguOne
;