RELATED NEWS
NEWS
చికాగో నగరంలో వాలీబాల్ పోటీలు

 

 

 

చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC) వారు ఈ  సంవత్సరం సాంస్కృతిక, కళారంగము తో సరి సమానముగా క్రీడా రంగానికి కూడా చాలా ప్రాముఖ్యం ఇచ్చారు అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదని చెప్పడానికి సంస్థ  నిర్వహించిన అనేకమైన క్రీడలు మరియు వాలీ బాల్ పోటిలే నిల్వెత్తు నిదర్శనం.


అద్యక్షులు రమేష్ గారపాటి ఈ సంవత్సర ఆరంభ కార్యవర్గ సమావేశంలో తన మనసులో మాటగా క్రీడా కార్యక్రమాలూ ఘనముగా నిర్వహించాలని చెపుతూ దానికి కావాల్సిన ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాల గూర్చి సవివరముగా  వివరించి క్రీడల కమిటి చైర్ పర్సన్ గా ప్రదీప్ కందిమళ్ళని నియమించినారు. ఈ పోటిలలో తోడ్పాటు అందించడానికి అమెరికా తెలుగు సంస్థ వారు  ముందుకు వచ్చారు.



ప్రదీప్ కందిమళ్ళ నాయకత్వములో క్రీడా కార్యక్రమాలను చెస్స్ తో  ప్రారంభించి,  బౌలింగ్, టేబుల్  టెన్నిస్, క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్ మరియు వాలీ బాల్ క్రీడతో ముగించినారు. అన్ని క్రీడారంగాలలో మొత్తం 750 మంది పైగా  క్రీడాకారులు పాల్గొన్నారు.



వాలీబాల్ పోటిలలో 150 మంది క్రీడాకారులు నాలుగు ( నిపుణత, మాధ్యమిక, మహిళా మరియు బాలబాలికల) విభాగాలలో పాల్గొని వారి వారి ప్రతిభని చాటినారు. ఈ పోటిలలో తెలుగు వారే కాకుండా ఇతర బాష క్రీడాకారులు పాల్గొనడం విశేషంగా అభివర్ణించవచ్చు . ఈ పోటీలను  అరోరాలోని గ్రేట్ లేక్స్ సెంటర్ క్రీడా ఆవరణలో జరిపించారు.



ఉదయం 10 గంటలకు ప్రారంభించి  సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు . భోజన సమయంలో పిజ్జా, అరటి పండ్లూ మరియు బిస్కెట్స్ అమర్చినారు. చల్లటి మంచినీరూ మరియూ మధు పానీయలు కూడా అమర్చినారూ. విజేతలందరికీ కానుకలను నవంబర్ 9, 2013 జరుపుకోబోయే దీపావళి సాంస్కృతిక కార్యక్రామాలలో అందచేస్తారు.


 
వాలీ బాల్ విజేతల వివరాలు:
మహిళలు మరియు బాల బాలికల విభాగంలో:
మొదటి విజేత నికిత  గారపాటి  జట్టు
రెండవ విజేత అనన్య  కునప రెడ్డి  జట్టు
మాధ్యమిక విభాగంలో:
మొదటి విజేత ప్రవీణ్ వేములపల్లి జట్టు
రెండవ విజేత వీరశరవనన్  చంద్రిక జట్టు
నిపుణత విభాగంలో:
మొదటి విజేత సుభాష్  కక్కెర జట్టు
రెండవ విజేత భరత్  కాకర్ల జట్టు


 
ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి  కృషి చేసిన క్రీడా సంఘ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ళ, సహాయ నిర్వాహకులు  రాము బిల్లకంటి, ప్రవీణ్  వేములపల్లి, T A G C కార్యవర్గ సభ్యులు  అంజి రెడ్డి కందిమళ్ళ, రాఘవ జెట్ల, హరి రైని, రవి ఉపద్, రామచంద్రా రెడ్డి ఆడే, జగన్ బుక్కరాజు, మాలతీ దామరాజు, రాబోయే సంవత్సర అద్యక్షులు శ్రీనివాస్ పెద్దమల్లు మరియు శ్రీనివాస్ రెడ్డి చాడ, రవి, రామ్ కనుపరెడ్డి,  శిరీష గారపాటి, సుష్మ కందిమళ్ళ, పద్మ ముసుకుల గార్లకు రమేష్ గారు ధన్యవాదాలు తెలిపారు.  కృష్ణ రంగరాజు న్యూ యార్క్  జీవిత భీమ సంస్థ తమవంతు సహాయాన్ని అందించినదుకు, న్యాయనిర్నేతలు మరియు క్రీడాకారులందరికీ సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు.



ఈ క్రీడా కార్యక్రమాలను అమెరికా తెలుగు సంస్థ సంయుక్తముగా నిర్వహించడానికి సహకరించిన సంస్థ అద్యక్షులు కరుణాకర్ మాధవరం, కార్యవర్గ సభ్యులు  సత్య కందిమళ్ళ, నరేందర్ చీమర్ల,  కళ్యాణ్ ఆనందులకు చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC) కార్యవర్గ  సబ్యులు తరుపున రమేష్ గారపాటి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;