RELATED NEWS
NEWS
ఆలయ పరిరక్షణ అంతర్జాతీయ సదస్సుకు మంత్రి సి.రామచంద్రయ్య మరియు డా. గజల్ శ్రీనివాస్

అమెరికా ఫ్రిస్కో, డల్లాస్, టెక్సాస్ లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) మరియు సేవ్ టెంపుల్స్ నిర్వహిస్తున్న ఆలయ పరిరక్షణ అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ సి.రామచంద్రయ్య ముఖ్య అతిథిగా మరియు సేవ్ టెంపుల్స్ సాంస్కృతిక రాయబారి డా.గజల్ శ్రీనివాస్ హాజరు కానున్నారు.


 ఈ అంతర్జాతీయ సదస్సు DFW హిందూ దేవాలయం, ఇర్వింగ్ TX, డల్లాస్, అమెరికాలో 11-08-2012తేదీన నిర్వహిస్తున్నట్లు దీనికి సుమారుగా వివిధ ప్రాంతాల నుండి 400 మంది ప్రతినిథులు పాల్గొననున్నట్లుగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌదేషణ్ (GHHF) వ్యవస్థాపకులు శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు తెలిపారు. Dr. స్టీఫెన్ క్నాప్, స్వామి బోదానంద, స్వామి బ్రహ్మదేవ్ లాంటి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారని అలాగే అమెరికాలోని కార్యసిద్ధి హనుమాన్ దేవస్థానం, హిందూ టెంపుల్ దేవస్థానం, శ్రీ గణేష్ టెంపుల్ దేవస్థానం, షిరిడి సాయిబాబా దేవస్థానం, శ్రీ లిలిత పీఠం, శ్రీ లక్ష్మీగణపతి దేవస్థానం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సనాతన ధర్మ ఫౌదేషణ్, బ్యాక్ టు ద రూట్స్, హిందూ మందిర్ సంస్థల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలిపారు.

 

శ్రీ రామచంద్రయ్య ప్రవాసాంధ్రులతో ఈ సదస్సులో చర్చలు జరిపి పురాతన దేవాలయాల పునర్ వైభవ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలు కోరతారు. శ్రీ సి.రామచంద్రయ్య మరియు డా. గజల్ శ్రీనివాస్ 26-08-2012 వరకూ అట్లాంటా, ఫ్లోరిడా, బఫ్ఫెల్లో, వాషింగ్టన్ DC, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాలలోని వివిధ దేవాలయాలను, ప్రభుత్వ కార్యాలయ విధి నిర్వహణను పరిశీలిస్తారు. అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలు ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు.

TeluguOne For Your Business
About TeluguOne
;