RELATED NEWS
NEWS
Hindu Forum of Briton: Madhava Thurumella Elected Vice president

బ్రిటన్ లో నివసించే హిందువులందరికీ ప్రాతినిధ్యం వహించే అతి ముఖ్యమైన అతి పెద్ద జాతీయ సంస్థ ‘హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్‘ కు వైస్ ప్రెసిడెంట్ గా తెలుగువారు శ్రీ మాధవ తురుమెళ్ల ఏకగ్రీవంగా ఎన్నికయారు. లెస్టర్ లో జరిగిన హిందూఫోరం జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

 

hindu forum of briton, madhava thurumella, hindu forum of briton vice president madhav thurumella, madhava thurumella london, nri madhava thurumella, vice president madhava thurumella



బ్రిటన్ లో సుమారుగా పన్నెండులక్షల మంది హిందువులు నివసిస్తున్నారని అంచనా. బ్రిటీష్ గవర్నమెంటు ఈ హిందువుల బాగోగులను గురించి ‘హిందూ ఫోరం‘ తో సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకుంటుంది. ఇప్పటివరకు హిందు ఫోరం అనేకమైన కీలక జాతీయ విషయాలలో బ్రిటీష్ ప్రభుత్వానికి తన అమూల్యమైన సలహాలను అందజేయడమేకాక, పరమతసహనం వంటి కీలకమైన కార్యక్రమాలను నిర్వహించి బ్రిటీష్ ప్రభుత్వమువారి మన్ననలు అందుకుంది.

శ్రీ మాధవ తురుమెళ్ల లండన్ లో నివసిస్తుంటారు. వీరు విదేశాలలో నివసించే హిందువులకు ప్రాతినిధ్యం వహించే జాతీయ సంస్థలలో అత్యంత కీలకమైన స్థానానికి చరిత్రలోనే మొట్టమొదట ఎన్నికకాబడ్డ తెలుగువ్యక్తి కావడం విశేషం! శ్రీ మాధవ తురుమెళ్ల సంస్కృతము, జర్మనీ, ఇంగ్లీషు, హిందీ, తెలుగు మరియు ఇతర భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. వీరు తెలుగులో కవి, కధకులు, ఆధ్యాత్మిక గ్రంధ రచయిత.  వీరు రచించిన శ్రీకృష్ణయజుర్వేదాంతర్గత ‘శతరుద్రీయము‘ అనే వ్యాఖ్యాన పుస్తకం చిన్మయామిషన్ ఆంధ్రప్రదేశ్ వారిచే ప్రచురితం అయి పది సార్లు పునర్ముద్రితమైంది. వీరు సుందరకాండపై ఇంగ్లీషులో ఒక వ్యాఖ్యాన గ్రంధాన్ని రచించారు. వీరు పట్టభద్రులైన తర్వాత ఒక రెండు సంవత్సరములపాటు చిన్మయామిషన్ వారి ఆశ్రమంలో ఉండి హిందూ ధర్మగ్రంధాలైన భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణము, భారతము మొదలైనవి అభ్యసించి ‘ధర్మవీర‘ అను బిరుదు పొందారు. వీరు ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి.
 
హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్ వెబ్‍సైట్ http://www.hinduforum.org.uk

TeluguOne For Your Business
About TeluguOne
;