RELATED NEWS
NEWS
సదా జన్మభూమి సేవలో

 

సదా జన్మభూమి సేవలో

 


చదువులనో.. ఉద్యోగమనో ఎక్కడో.. ఎక్కడో స్థిరపడి.. పుట్టినగడ్డను మరచిపోయి.. కోట్లు కూడబెట్టడం తప్ప వేరే పని లేదని వ్యవహరిస్తున్న ఈ రోజుల్లో.. కోట్లు సంపాదించిన ఆనందం కన్నా.. దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతో.. మాతృభూమికి ఎంతో కొంత చేయాలని తపన పడే వారు అరుదనే చెప్పవచ్చు. అలాంటి వారిలో ఒకరు శశికాంత్ వల్లేపల్లి. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని లేక.. కొండంత రెవెన్యూ లోటుతో.. పీకల్లోతు అప్పులతో.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా బండి నడుపుతోంది ఏపీ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూనే.. పారిశ్రామికంగా వెనుకబడిన ఏపీలో పరిశ్రమలు నెలకొల్పి.. తిరిగి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టాలని పనిచేస్తున్నారు.

 

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు.  నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసులను భాగస్వామ్యులను చేసి పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపును అందుకుని తాను ఆ దారిలో నడవటమే కాకుండా.. నలుగురిని నడిపిస్తున్నారు శశికాంత్ వల్లేపల్లి. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఆయన విద్యాభ్యాసం ఇక్కడే గడిచింది.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ పునాదులపై అంచలంచెలుగా ఎదిగిన శశికాంత్.. అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 

తెలుగువారికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటూ.. వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. అలా అక్కడి తెలుగువారికి తలలో నాలుకలా ఉంటూనే.. కొత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన తన మాతృ రాష్ట్రం ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని నిర్ణయించుకున్నారు. తన ఒక్కడితో పాటు మరో నలుగురిని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిలో భాగస్వాములను చేసేందుకు శ్రమిస్తున్నారు శశికాంత్. తాజాగా నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తోన్న మంత్రి నారా లోకేష్‌‌‌కు బోస్టన్‌లో ఘనస్వాగతం పలికారు శశికాంత్.

 

 

అనంతరం తన తోటి ప్రవాసాంధ్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయించి.. ఏపీలో పెట్టుబడుల ఆవశ్యకత.. అక్కడి మౌలిక సదుపాయాలు... ప్రభుత్వ ప్రొత్సాహకాలు తదితర అంశాలపై చర్చించారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తపిస్తోన్న శశికాంత్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ.. ఆయనని స్పూర్తిగా తీసుకొని.. మరికొందరు ప్రవాసులు నడవాలని ఆకాంక్షిద్దాం.

 

TeluguOne For Your Business
About TeluguOne
;