RELATED ARTICLES
ARTICLES
శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్


శ్రీ ఆర్.పీ. సింగ్  - మీట్ అండ్ గ్రీట్ 


 

ఎడిసన్ న్యూ జెర్సీ: ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ,మీట్ అండ్ గ్రీట్  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపీ జాతీయ కార్యదర్శి శ్రీ ఆర్.పీ. సింగ్ గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. శ్రీ ఆర్.పీ. సింగ్ గారు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రవాస బారతీయలకు, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లో నెలకొన్న భద్రతా ఆందోళనలు, టెర్రరిఓం, రానున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల వ్యూహం,కార్య నిర్వహణ, అనేక మోడీ ప్రభుత్వపు పతకాలు వాటి ఉపయోగాలు, ఢిల్లీ లోని ఆమ్ ఆద్మీ పార్టీ దుష్పరిపాలన, వారి మోసపూరిత విధానాలు, ప్రజా ధనం  దుర్వియోగం, భారత దేశ ఐక్యత లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర, మరియు రాబోయే రోజుల్లో  మోడీ ప్రభుత్వం చేపట్టబోయే  కార్యక్రమాలు ఇలాంటి చాల విషయాల గురించి క్షున్నంగా వివరించడం జరిగింది. దీనితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.


ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు తన ప్రసంగంలో, భారత దేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు ఎలా భ్యాగస్వాములు అవ్వగలరో వివరించారు. అలాగే ఓఎఫ్ బిజెపీ విస్తరణ, భవిషత్తు కార్యాచరణ గురించి కూడా మాట్లాడారు. ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ సహా-కన్వీనర్ శ్రీ ఆనంద్ జైన్ గారు ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.   ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ జయేష్ పటేల్, శ్రీ చంద్రకాంత్ త్రివేది, శ్రీ బాల గార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవని గురించి చర్చించారు. ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్లు శ్రీ దీప్ భట్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గార్లు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువత చేసున్న అనేక కార్యక్రమాల గురించి తెలియజేశారు.  ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వరదన్ గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ సహా -కన్వీనర్ శ్రీ  శ్రీకాంత్ రెడ్డి గారు, న్యూ జెర్సీలోని కార్యక్రమాల గురించి మాట్లాడారు. శ్రీ గుంజాన్ మిశ్ర, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గార్లు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యూహాల గురించి చర్చించారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;