ARTICLES
TAL Renovated CP Brown Grave

 

లండన్ లో CP Brown Telugu Foundation ఆవిర్భావం

తెలుగు సాహిత్యానికి C P Brown అందించిన సేవలు చిరస్మరణీయాలు. అటువంటి Brown సమాధిని పరిరక్షించి మరల C P Brown పేరుతో ఒక పౌండేషన్ [CP Brown Telugu Foundation of Europe] ను స్థాపించి London లో తెలుగు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నడుంకట్టింది.

 

 

07 ఏప్రిల్ 2012న, పశ్చిమ లండన్ లోని isleworth & Syon School లో తాల్ ఆధ్వర్యంలో, ఈ పౌండేషన్ తన ప్రప్రథమ లండన్ తెలుగు సభలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు భాషకు సేవచేసిన స్థానిక మరియు ఆంధ్రప్రదేశ్ నుండి భాషా, సాహిత్య కోవిదులను ఆహ్వానించింది.

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. గూటాల కృష్ణమూర్తి Robert Cotton (sir arthur cotton great grandson) దంపతులు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, హంస అవార్డు గ్రహీత శ్రీ. గోరెటి వెంకన్న, వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గార్లు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా పంచ సహస్ర అవధాని డా. మేడసాని మోహన్, శ్రీమతి. హేమ మాచెర్ల, ఫ్రెంచ్ తెలుగు professor Daniel హాజరయ్యారు.

 

 

ఈ కార్యక్రమం శ్రీమతి. శశికళ తల్లం గారి ప్రార్ధన గీతంతో మొదలై, డా. వ్యాకరణం రామారావు గారి C P Brown మీద కవిత్వంతో ఉత్తేజితమైంది. తరువాత తాల్ చైర్మన్ వనం శ్రీధర్, వైస్ చైర్మన్ మహేష్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శి రాజారెడ్డి మరియు తాల్ కార్యవర్గం సమక్షంలో లాంచనంగా C. P. Brown సమాధి పరిరక్షణ భాద్యతలను నూతన కమిటీకి అప్పగించారు.

 

 

ఈ సందర్భంగా, ముఖ్య అతిథి డా. గూటాల కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను చేసిన C. P. Brown కు సంబంధించిన పరిశోధనల వివరాలు ఆ క్రమంలో జరిగిన సంఘటనలను వివరించారు. పద్మశ్రీ YLP మాట్లాడుతూ, ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన TAL కార్యవర్గాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవాస ఆంధ్రులు కూడా భాష పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్ సాంప్రదాయ సాహిత్యం గురించి చేసిన ప్రసంగం, ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న గారు వివరించిన సంప్రదాయ మరియు ఆధునిక సాహితిరూపాలలో కవిత్వాంశ ఆవశ్యకత మరియు ఆయన చేసిన గానం, కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్ గారు వివరించిన నవీన్ సాహిత్యం;లో వస్తున్న మార్పులు, కవి శివారెడ్డి వివరించిన Socialisation of Poetry, శ్రీమతి. హేమ మాచెర్ల గారి ప్రసంగం సభికుల మన్ననలను పొందారు. ఈ సందర్భంగా ఫ్రెంచి దేశీయుడైన prof. Daniel తను తెలుగు భాషను ఏ విధంగా నేర్చుకున్నది ఆ తరువాత తన దేశంలో ఒక తెలుగు ఆచార్యుడుగా తెలుగు భాషాభివృద్ధి వివరాలు తెలుగులో ప్రసంగించారు.

 

 

ఈ సందర్భంగా శ్రీమతి ములుకుట్ల యోగ గారి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆద్యంతం డా. మాదిన రామకృష్ణ డా. జొన్నలగడ్డ మూర్తి, శ్రీమతి. అరవింద గార్లు సంధానకర్తలుగా వ్యవహరించారు. శ్రీమతి అరవింద వందన సమర్పణ చేస్తూ, తాల్ కార్యవర్గ సభ్యులకు, విచ్చేసిన సాహితి ఔత్సాహికులకు, అతిథులకు వారి సమయానికి, రుచికరమైన భోజనం అందించిన caterers కు, కార్యక్రమ నిర్వహణలో అడుగడుగున సహాయం చేసిన volunteers కు, UK లోని తెలుగు రేడియో తెలుగువాణి వ్యవస్తాపకులు మాధవ తురుమెల్ల గారికి, TV9 reporter వంశికి ధన్యవాదాలు తెలపడంతో మధ్యాహ్న కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

 

 

పునరుద్ధరించిన C P Brown సమాధి ఫలక ఆవిష్కరణ:

 

ఈ కార్యక్రమానికి ముందు ఉదయం, London లోని kensal Green Cemetery లో, TAL పునరుద్ధరించిన CP Brown సమాధి వద్దకు Sir Arthur Cotton ముని మనుమడు Robert Cotton దంపతులు, భారతీయ దౌత్యవేత్త శ్రీ. చింతపల్లి రాజశేఖర్, పద్మశ్రీ YPL, ప్రముఖ కవులు గోరెటి వెంకన్న & వాసిరెడ్డి, కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్, ఫ్రెంచ్ తెలుగు prof. Daniel Neggers, తాల్ కార్యవర్గ సభ్యులు, తాల్ పూర్వ అధ్యక్షులు డా. రాములు, తాల్ పూర్వ చైర్మన్ బోయల్ల రామానాయుడు, మరియు ప్రవాసాంధ్ర కవులు డా. మాదిన రామకృష్ణ, డా. జొన్నలగడ్డ మూర్తి తదితరులు విచ్చేశారు. తరువాత పునరుద్దరించబడిన సమాధి ఫలకాన్ని, Cotton దంపతులు ఆవిష్కరించారు.

 

 

ఈ సందర్భంగా Cotton దంపతులు మాట్లాడుతూ, పునరుద్దరించబడిన C P Brown సమాధి ఫలకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తాల్ ను అభినందించారు. తరువాత తాల్ చైర్మన్ వనం శ్రీధర్ మాట్లాడుతూ, పునరుద్దరణకు స్పూర్తినిచ్చిన మండల బుద్ధప్రసాద్, YLP లకు మరియు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తాల్ తరపున ఈ సమాధిని నూతన CP Brown Telugu Foundation of Europe కమిటికి అప్పగించారు. ఈ సందర్భంగా CP Brown Telugu Foundation of Europe అధ్యక్షులు డా. రాములు మాట్లాడుతూ, CP Brown సాహిత్య ఆశయాలకు అనుగుణంగా నూతన కమిటీ భాషా పరిరక్షణకు, అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;