RELATED NEWS
NEWS
అమెరికాలో వేలాది విద్యార్ధులతో కోలాహలంగా మనబడి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం!


San Jose, September 12,2015 : “భాషా సేవయే భావితరాల సేవ” అనే నినాదంతో గత 8 సంవత్సరాలుగా ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి 2015-16 విద్యాసంవత్సర తరగతులు అమెరికా వ్యాప్తంగా 35 రాష్ట్రాలలో అత్యంత ఉత్సాహం గా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా మనబడి కులపతి రాజు చమర్తి మాట్లాడుతూ, దాదాపు 5000 మంది విద్యార్ధులు మనబడి లో ఇప్పటికే నమోదు చేసుకున్నారని, ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశానికి తుది గడువు సెప్టెంబర్ 25 తో ముగుస్తుందని, ఇంకా నమోదు చేసుకోవాలునుకునే వారు వెంటనే మనబడి వెబ్ సైట్ ttp://manabadi.siliconandhra.org ని సందర్శించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.


గత వారం రోజులు గా స్వచ్చంద భాషా సైనికులు దాదాపు 2 టన్నుల మనబడి పాఠ్య పుస్తకాలను ముద్రించి, వివిధ ప్రాంతాలకు తపాల శాఖ ద్వారా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాటు చేశారు. మనబడి విస్తరణ విభాగం అద్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ  ఈ విద్యా సంవత్సరం లో  29 కొత్త కేంద్రాలతో నెవడా, అలబామ, కెంటకీ, అయోవ, మిజోరి రాష్ట్రాలకు కూడా మనబడి విస్తరించిందని తెలిపారు.  సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల తల్లి తండ్రులను ఉద్దేశించి  ప్రసంగిస్తూ మనబడి మనందరి బడి అని, ఈ భాషా యజ్ఞం లో అందరూ పాలు పంచుకుని, తెలుగు భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దడంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు.   


ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లను పాఠ్యప్రణాళికా,ప్రాచుర్య విభాగాల నుంచి శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, మనబడి కీలక బృంద సభ్యులు దీనబాబు కొండుభట్ల, డాంజి తోటపల్లి, అనిల్ అన్నం, స్నేహ వేదుల, శ్రీదేవి గంటి, నాగ్ యనగండ్ల,కళ్యాణి సిద్దార్ధ, శ్రీరాం కోట్ని, రమ,ఫణి మాధవ్ కస్తూరి, పరిపాలన విభాగం సభ్యులు జయంతి కోట్ని, ప్రియ తనుగుల, శ్రీవల్లి కొండుభట్ల, వివిధ రాష్ట్రాలనుంచి ఎందరో ప్రాంతీయ సమన్వయ కర్తలు, ఉపాధ్యాయులు, భాషా సైనికులు పర్యవేక్షించారు. 

TeluguOne For Your Business
About TeluguOne
;