RELATED NEWS
NEWS
స్విట్జర్లాండ్‌లో తెలుగు ఎన్నారైల సదస్సు

 

తెలుగు ఎన్నారైల ఫోరం మేధో మథన సదస్సు స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలుగా తాము ఏం చేయాలన్న అంశం మీద ఈ సదస్సులో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం విశాఖపట్నం స్టార్టప్ విలేజ్ ఆపరేషన్ హెడ్ వాసుదేవ తుమ్మటితో ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థలు స్థాపిస్తే లభించే పన్ను రాయితీలు, సౌకర్యాల విషయంలో ఆయన ఎన్నారైలకు అవగాహన కల్పించారు. ఈ చర్చ సారాంశాన్నంతటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించడానికి స్విస్ తెలుగు ఎన్నారై ఫోరం నిర్ణయించింది. చంద్రబాబు దావోస్ పర్యటన సందర్భంగా ఇచ్చిన పిలుపుతోనే తాము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నట్టు తెలుగు ఎన్నారైల ఫోరం సభ్యులు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne