RELATED ARTICLES
ARTICLES
సునీల్ కు సాయం చేద్దాం రండి..: నాట్స్



అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్  ప్రస్తుతం  ఓ తెలుగుకుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలో తెలుగు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

అమెరికా.. హవాయిలో ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడిన సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతానికి చెందిన అత్యం సునీల్ గవాస్కర్  ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. హవాయిలో నివాసముంటున్న సునీల్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.  కొలను పక్కన నడుచుకుంటు వెళ్తున్న సునీల్ పొరపాటున కాలుజారి కొలనులో పడిపోయాడు. సునీల్ కు ఈతరాకపోవడం అతడికి శాపంగా మారింది. స్థానికంగా ఉండే ముగ్గురు అతడిని కొలను నుంచి బయటకు తెచ్చారు. అయితే అప్పటికే  సునీల్ కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సునీల్ ను మృత్యువు బారి నుంచి కాపాడే ప్రయత్నం డాక్టర్లు చేస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సునీల్ ను బతికించుకోవాలంటే ప్రస్తుతం వైద్యఖర్చులు ఆ కుటుంబానికి ఆర్ధిక భారంగానే మారాయి. ఈ విషయం తెలుసుకున్న నాట్స్ వెంటనే రంగంలోకి దిగింది. సునీల్ వైద్య ఖర్చులకు తన వంతు సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నాట్స్ సభ్యులను, నాట్స్ పిలుపుకు ప్రతిస్పందించే ప్రతి ఒక్కరిని సునీల్ కు సాయం చేద్దాం రండి అని కోరుతోంది.

TeluguOne For Your Business
About TeluguOne