RELATED NEWS
NEWS
న్యూజెర్సీ నాట్స్ ఫుడ్ డ్రైవ్ విశేష స్పందన

 

న్యూజెర్సీ నాట్స్ ఫుడ్ డ్రైవ్ విశేష స్పందన


ఎడిసన్, న్యూ జెర్సీ: ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ రంగంలోకి దిగింది. నాట్స్ మహిళా విభాగం ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందించాయి. పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం  అని పోటీపడ్డాయి.. ఒక్కో ఛాప్టర్ లో వేల కొద్ది ఫుడ్ క్యాన్స్ సేకరించి పేదలకు పంచి పెట్టాయి. తాజాగా న్యూజెర్సీలో కూడా నాట్స్ ఫుడ్ డ్రైవ్ విశేష స్పందన లభించింది.

 

 

ఇక్కడ సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను నాట్స్ న్యూజెర్సీ టీం పేదలకు అందించింది. ఈ సమాజం కోసం నా వంతు బాధ్యత ఏమిటని ఆలోచించే చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్ ను ఉచితంగా అందించారు. నాట్స్ ఇచ్చిన  పిలుపును అందుకున్న తెలుగు ప్రజలు చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్ విరాళంగా ఇచ్చారు.  అన్నార్తులకు  అండగా నిలబడేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందనేది ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. నాట్స్ వాలంటీర్లు, సభ్యులందరూ ఫుడ్ డ్రైవ్ విజయవంతం అయ్యేందుకు.. తమకు తోచిన ప్రతి ఒక్కరిని తోచినంత సాయం చేసేలా చేశారు.

 

 

నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవతో పాటు, బోర్డు అఫ్ డైరెక్టర్స్ డా. మధు కొర్రపాటి, అరుణ గంటి, రంజిత్ చాగంటి నాట్స్ నాయకులు.. వంశీకృష్ణ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, విష్ణు ఆలూరు, మురళీకృష్ణ మేడిచెర్ల, చంద్రశేఖర్ కొణిదెల, ప్రసాద్ గుర్రం, సూర్యం గంటి,  సూర్య గుత్తికొండ, శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి, మోహన్ కుమార్ వెనిగళ్ల, చైతన్య, కవిత తోటకూర,  సుశీల పానుగంటి, సుధీర్ తుమ్మల, చైతన్య పెద్దు , అరుణ్ మాదిరాజు, వెంకట్ సత్యేన్ద్ర కడియాల, సుధీర్ పోతు, పద్మజ నన్నపనేని,స్థానిక సాయి దత్త పీఠం నుండి శుభ పాటిబండ్ల, లక్ష్మి పాత్రుని, వంశీ గరుడ, శ్రీధర్ దోనేపూడి, తదితరులు ఈ పుడ్ డ్రైవ్ కోసం భారీగా ఫుడ్ క్యాన్స్ సేకరించారు. 

 



న్యూ జెర్సీ  లో జరిగిన  1 మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ తో పాటుగా నాట్స్ కొలంబస్, డిట్రాయిట్, డల్లాస్, చికాగో,  సెయింట్ లూయిస్, చాఫ్టర్ల లో విశేషంగా సేకరించటంతో నాట్స్ మహిళా విభాగం, నాట్స్ విజయవంతముగా ముగిసినట్టు ప్రకటించింది.

 

 

మోహనకృష్ణ మన్నవ, మధు కొర్రపాటి తదితరులు మీడియా తో మాట్లాడుతూ భాషే రమ్యం సేవే గమ్యం అని నమ్మే నాట్స్, ఈరోజు జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందించారు. ఈ రకమైన సేవా కార్యక్రమాలు.. స్థానిక సంస్థల సహాయ సహకారాలతో, దాతల ధాతృత్వంతో మున్ముందుమరెన్నో కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.



TeluguOne For Your Business
About TeluguOne
;