RELATED NEWS
NEWS
“ఆస్క్ అటార్నీ- ఇమ్మిగ్రేషన్ హెల్ప్ లైన్” నిర్వహించిన సీటీఏ, నాట్స్

ఇమ్మిగ్రేషన్ సందేహాలను నివృత్తి చేయడానికి చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ సంయుక్తంగా ‘ఆస్క్ అటార్నీ’ పేరుతో హెల్ప్ లైన్ నిర్వహించింది. అటార్నీ ప్రవీణ్ మేడికుందం అమెరికాలోని తెలుగువారి సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈమధ్య అమెరికా తన ఇమ్మిగ్రేషన్ విధానం, చట్టంలో మార్పులు చేసింది. ముఖ్యంగా స్టూడెంట్ ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఐ-485 ప్రాసెసింగ్ టైమ్స్, డిపెండెంట్ వీసా, పేరెంట్ స్పాన్సర్ షిప్స్ మొదలైన వాటిలో మార్పుచేర్పులు చేసింది. వాటి గురించి నేరుగా, క్షుణ్ణంగా తెలుసుకునేందుకు చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ తెలుగువారికి గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు పాల్గొన్నారు.

ఆస్క్ అటార్నీ పేరుతో ప్రత్యేకర కార్యక్రమాన్ని సీటీఏ, నాట్స్ నిర్వహించింది. గంటన్నరపాటు జరిగిన ముఖాముఖిలో అడిగిన అన్ని ప్రశ్నలకు అటార్నీ ప్రవీణ్ సవివరంగా సమాధానాలిచ్చారు. ముందుగా ఇమ్మిగ్రేషన్ చట్టంలో తీసుకొచ్చిన మార్పులను వివరించి ఆ తరువాత ఈ అంశంపై 25 మందికి పైగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ పద్దతులను వివరించి ప్రవీణ్.. గ్రాడ్యుయేషన్ తరువాత ఉన్న అవకాశాలపై విద్యార్థులకు సలహాలిచ్చారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ), సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) లో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది కూడా వివరించారు.

డిపెండెంట్ వీసా పొందడంలో ఉన్న సమస్యలపై పరిష్కార మార్గాలు చెప్పారు. ముఖ్యంగా ఐ-140 దరఖాస్తుకు అనుమతి వచ్చినప్పటికీ డిపెండెంట్ వీసా కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి తరువాత ప్రాసెస్ ను వివరించారు.

స్పాన్సరింగ్ పేరెంట్స్ కు సంబంధించి ఓ సిటిజెన్ అడిగిన ప్రశ్నకు.. ఐ485  దరఖాస్తు నుంచి మిగతా వివరాల వరకు వివరించారు.

చికాగో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు నాగేంద్ర వేగె, సీటీఏ బోర్డు సభ్యుడు మూర్తి కొప్పాక, సీటీఏ వైస్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, నాట్స్ కో-ఆర్డినేటర్ రమేష్ మార్యాల ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. కార్యక్రమం అర్థవంతంగా నడిచేలా సీటీఏ సెక్రటరీ సుబ్బారావు పుట్రేవు, మూర్తి కొప్పాక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎంతోమందికి ఉపయోగపడే ఇలాంటి ఈవెంట్ నిర్వహించినందుకు సీటీఏ, నాట్స్ కు కార్యక్రమానికి వచ్చిన వారంతా అభినందనలు తెలిపారు. విలువైన సమయాన్ని వెచ్చించి, ఎన్నో అనుమానాలు నివృత్తి చేసినందుకు అటార్నీ ప్రవీణ్ మేడికుందం కు సీటీఏ, నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన చికాగో నాట్స్, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగె అండ్ టీమ్ కు నాట్స్ అధ్యక్షుడు రవి ఆచంట కృతజ్ఞతలు తెలిపారు.

నెలకోసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులెవరైనా ముందుగా రిజిస్టర్ అయి ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చని  సీటీఏ, నాట్స్ ప్రకటించింది. తదుపరి ఆస్క్ అటార్నీ ప్రోగ్రామ్ ను నవంబర్ 14న సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నట్లు చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ తెలిపాయి.

TeluguOne For Your Business
About TeluguOne
;