RELATED NEWS
NEWS
రామానాయుడు మృతి పట్ల నాట్స్ సంతాపం

 

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత రామానాయుడు మృతిపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వరుసగా తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలుగా వెలుగొందిన వారు ఒక్కొక్కరుగా దూరం కావడం తీవ్రంగా కలిచివేస్తోందని నాట్స్ ప్రకటించింది. రామానాయుడు కుటుంబ సభ్యులకు అమెరికాలో తెలుగువారి తరపున నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. 2011లో హైదరాబాద్ లో నాట్స్ రామానాయుడును జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన రామానాయుడును తెలుగుజాతి విస్మరించేలేదని నాట్స్ బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ మధు కొర్రపాటి అన్నారు. సామాజిక సందేశాలు ఉండే చిత్రాలు రూపొందించడంతో పాటు.. తాను జీవితంలో కూడా సామాజిక సేవను విస్మరించని రామానాయుడు జీవితం అందరికి ఆదర్శప్రాయమైనదని నాట్స్ అధ్యక్షుడు రవి అచంట అన్నారు.. అధిక భాషల్లో చిత్రాలు తీయడంతో పాటు.. ప్రపంచంలో అధిక సినిమాలు తీసిన నిర్మాతగా గిన్నీస్ రికార్డు సాధించిన రామానాయుడు యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచారని రవి అచంట కొనియాడారు. రామానాయుడు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;