RELATED NEWS
NEWS
నాట్స్ తెలుగు సంబరాల్లో సినిమా సదస్సు

సినిమాలపై కోన వెంకట్, క్రిష్  విలువైన సూచనలు


Sri Kona Venkat, Writer


సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనే వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.. ప్రముఖ దర్శకుడు క్రిష్ , రచయిత కోనవెంకట్ ల ఆధ్వర్యంలో డాలస్ వేదికగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో... సినిమానిర్మాణంపై సదస్సు ఏర్పాటు చేయనున్నారు..జూలై 5,6 తేదీల్లో జరిగే ఈ సదస్సు కోసం నాట్స్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. సినిమాకు సంబంధించి కథ ఎలా పడుతుంది.. ఆ తర్వాత ఆ కథను ఎలా డెవలప్ చేయాలి..? దానికి కథనాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి..? స్క్రిప్ట్ పూర్తయ్యాక బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలి..? సినిమాని ఎలా తెరకెక్కించాలి..? దానిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి..? ఎలా రీలీజ్ చేయాలనే అనేక అంశాలను ఈ సదస్సులో వివరించనున్నారు.



Sri Krish, Director


కోన వెంకట్, క్రిష్ ఈ సదస్సులో తమ అమూల్యమైన  సలహాలు, సూచనలు అందించనున్నారు.. ఎన్నో హిట్ చిత్రాలకు రచన చేసిన కోన వెంకట్ ఇప్పుడు అమెరికాలో ఉండే తెలుగువారితో ఓ సినిమాను రూపొందిచనున్నారు. కోన వెంకట్ ఆయన కూతురుతో  ప్రస్తుతం న్యూయార్క్ , న్యూ పోర్ట్ లో ఈ సినిమా  కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.. ఇటు సినిమా వర్క్ షాపు ద్వారా కోన వెంకట్ సినిమా కోసం తపించే ప్రవాసాంధ్రులకు  విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.  డాలస్ వేదికపై జరిగే తెలుగు సంబరాల్లో సినిమా సదస్సుకూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

TeluguOne For Your Business
About TeluguOne
;