RELATED EVENTS
EVENTS
కాలిఫోర్నియాలో నాట్స్ సంబరాల టీం రక్తదానం

సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అదే బాటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ప్రపంచ రక్తదాన దినోత్సవంలో కూడా నాట్స్ సంబరాల టీం నేనుసైతమంటూ రక్తదాన కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సదరన్ కాలిఫోర్నియా డివిజన్ తో కలిసి చేపట్టింది. ఈస్ట్ వేల్ కాలిఫోర్నియాలో చేపట్టిన ఈ రక్తదాన శిబిరానికి దాతల నుంచి మంచి స్పందన వచ్చింది.

రక్తదానం ప్రాముఖ్యతను దాని వల్ల కలిగే ప్రయోజనాలను నాట్స్ వాలంటీర్లు,ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా వివరించారు. రక్తదానంతో ప్రాణాలను ఎలా రక్షించవచ్చనేది చిన్నపిల్లలు వివరించడం అందరిని ఆకట్టుకుంది. మొత్తం 57 మంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు. 126 మంది రోగులు ఈ రక్తదానం వల్ల లబ్ధి పొందుతారని రెడ్ క్రాస్ తెలిపింది.  యువవాలంటీర్లు, చిన్నారులు ఈ రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి చేసిన సేవలను వెంకట్ ఆలపాటి కొనియాడారు.



ముఖ్యంగా సిరి బండారు, మధుమిత కొల్లూరి, నేహా వల్లూరి, శృతి బండారు, హర్షి కెల్లంపల్లి  లను నాట్స్ సంబరాల టీం అభినందించింది. ఇదే రక్తదాన శిబిరంలో సేవే లక్ష్యంగా సాగుతున్న నాట్స్ ప్రతి రెండేళ్లకొక్కసారి భారీ ఎత్తున నిర్వహించే సంబరాల గురించి వివరించారు. లాస్ ఏంజిల్స్  అనహేం కన్వెన్ష్ సెంటర్ లో జరుగుతున్న ఈ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ తెలిపింది.

TeluguOne For Your Business
About TeluguOne
;